జులై 24న వరంగల్ కు సీఎం కేసీఆర్

హైదరాబాద్ : ఈ నెల 24న వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నర్సంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని సీఎం పరామర్శించనున్నారు. ఇటీవల పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజు రెడ్డి మృతి చెందారు. మార్గం మధ్యలోనే వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలంలో పెద్ది సుదర్శన్ రెడ్డిని, కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించానున్నారు.

ads

అందుకు సంబంధించిన ఏర్పాట్లు బుధవారం నుండే ప్రారంభమయ్యాయి. నల్లబెల్లి మండలం కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి చేరుకోవడానికి కావాల్సిన రోడ్లు సౌకర్యం, ఇతర వసతులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరితల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.