ప్రధాని మోడీతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే భేటీ

న్యూఢిల్లీ : మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మంగళవారం భేటీ అయ్యారు. ఉదయం 11.30 సమయంలో ప్రధాని అధికారిక నివాసం ఉన్న 7 లోక్​ కల్యాణ్ మార్గ్​కు ఠాక్రే చేరుకున్నారు. మరాఠా రిజర్వేషన్లు, తుఫాను సాయం, టీకాలు తదితర అంశాలపై మోదీతో చర్చలు జరిపారు. ఠాక్రే వెంట మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, మంత్రి అశోక్ చవాన్​లు వెళ్లారు.మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గత నెల సంచలన తీర్పు ఇచ్చింది. మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో 16 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మహరాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. మరాఠా రిజర్వేషన్లు.. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.

ads