కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ ఫోటో విడుదల

చత్తీస్‌గఢ్‌ : మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ తాజా ఫోటోను బుధవారం మావోయిస్టులు విడుదల చేశారు. ఫోటో విడుదల చేసి రాకేశ్వర్‌ తమ దగ్గరే సురక్షితంగా ఉన్నాడని మావోలు తెలిపారు. తమ వద్ద బందీగా ఉన్న రాకేశ్వర్‌ను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంగళవారం మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.

ads

ప్రభుత్వం చర్చలకు మధ్యవర్తులను ప్రకటిస్తే రాకేశ్వర్‌ను విడుదల చేస్తామని మావోయిస్టులు తెలిపారు. మధ్యవర్తుల పేర్ల విషయంలొ కూడా స్పష్టత ఇవ్వాలన్నారు. అయితే మావోయిస్టులతో చర్చలకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. బీజాపూర్ దాడి ఘటనలో రాకేశ్వర్‌ మావోయిస్టులకు చిక్కిన విషయం తెలిసిందే.