చికిత్సకు ఇబ్బందులు ఉండొద్దు : మంత్రి ఈటల

హైదరాబాద్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్సకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ ఆదేశించారు. కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళనతో పరిస్థితి ఎలా ఉందంటూ మంత్రి ఈటల రాజేందర్​ను అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యే లు కలిసి ఆరా తీశారు. ఈ మేరకు మంత్రి ఈటల తన ఛాంబర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, డీపీహెచ్​ డాక్టర్​ శ్రీనివాస్ మరియు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్య అసోసియేషన్ లతో ఫోన్ లో మాట్లాడారు. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇన్ పేషంట్ల సంఖ్య కూడా పెరిగింది. కానీ తీవ్రత లేదని అధికారులు మంత్రి ఈటలకు వివరించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని అధికారులను మంత్రి కోరారు. తదనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపిన మంత్రి ఈటల రాజేందర్​ వెల్లడించారు.

ads