పెరిగిన చమురు ధరలపై కాంగ్రెస్ నిరసన జ్వాలలు

వరంగల్ అర్బన్ జిల్లా : ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. వరంగల్ అర్బన్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ నక్కలగుట్టలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

ads