కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ ఇకలేరు

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నేడు ఉదయం 3.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఎమ్మెస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ చైర్మన్ గా, దేవాదాయ , క్రీడ, సినిమాటోగ్రఫి శాఖల మంత్రిగా పనిచేశారు.

ads

1980 నుంచి 1983 వరకు ఎమ్మెస్సార్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1990 నుంచి 1994 వరకు ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నారు. 2000 నుంచి 2004 వరకు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2007 వరకు సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2006లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సవాల్ చేసి కరీంనగర్ లోక్ సభ ఉపఎన్నికకు కారణమయ్యారు.