ఎమ్మెస్సార్ మృతిపట్ల సీఎం సంతాపం

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెస్సార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ వాదిగా, మంత్రిగా, ఎంపీగా ఎమ్మెస్సార్ ప్రత్యేక శైలి కనబరిచారు. రాజకీయాల్లో ఎమ్మెస్సార్ ముక్కుసూటి మనిషిగా పేరొందారు. ఎమ్మెస్సార్ మృతి పట్ల శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెస్సార్ మృతి పట్ల కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొన్నల సంతాపం తెలిపారు. ఎమ్మెస్సార్ మరణం పార్టీకి తీరని లోటు. ఆయన క్రమశిక్షణ కల్గిన గొప్ప నాయకుడు. ఎమ్మెస్సార్ మృతిపట్ల ఏఐసీసీ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ సంతాపం తెలిపారు.

ads