ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైద్యవిధాన పరిషత్ పరిధిలోని ఏరియా వైద్యశాల ఎంసీహెచ్ సెంటర్ భూపాలపల్లి నందు ఒప్పంద పద్దతిలో పనిచేయుటకు గైనకాలజిస్టులు (3), అనస్థీషియా వైద్యులు (2), ఎంబీబీఎస్ (3), స్టాఫ్ నర్సులు (20), ల్యాబ్ టెక్నిషియన్స్ (2), ఫార్మాసిస్టులు(2), డాటా ఎంట్రీ ఆపరేటర్లు (2), థియేటర్ అసిస్టెంట్లు (4), ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ (6), సెక్యూరిటీ గార్డులు (4), శానిటేషన్ సిబ్బంది (4) ఉద్యోగాల భర్తీ కొరకు జిల్లా కలెక్టర్ మరియు సూపరింటిండెంట్, జిల్లా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ భూపాలపల్లి ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇట్టి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించిన విద్యార్హతల జిరాక్స్ పత్రాలతో ఫిబ్రవరి 3 వ తేదీ వరకు (సెలవు దినాలలో కూడా) ఉదయం 10.30 ని,,ల నుండి సాయంత్రం 5 గం,ల వరకు ఏరియా వైద్యశాల భూపాలపల్లి నందు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.