మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‎లో గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 118 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 89 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 8,90,884కు చేరింది. 8,82,670 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 1,038 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 7,176 మంది మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 45,079 శాంపిళ్లను పరీక్షించారు ఇప్పటివరకు 1,43,07,165 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ads