జీహెచ్ఎంసీలో కరోనా కలకలం

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఐదో అంతస్తులో ఉన్న చీఫ్‌ ఇంజినీర్‌ విభాగంలో ఇద్దరికి కరోనా సోకింది. అప్రమత్తమైన బల్దియా ఆ అంతస్తులోని ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది. అనంతరం కరోనా కేసులు వచ్చిన ఫ్లోర్‌ను శానిటైజ్‌ చేయించింది.

ads