భారత ఆటగాళ్లకు కరోనా

ముంబై : దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. బీహార్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర జట్లకు చెందిన ఒక్కో ఆటగాడికి కొవిడ్- 19 పాజిటివ్‎గా నిర్ధారణ అయిందని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ముగ్గురు ఆటగాళ్లను ప్రస్తుతం ఐసోలేషన్‎లో ఉంచారు. గతవారమే మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‎ ప్లేయర్లకు పాజిటివ్‎గా తేలింది. దీంతో ఇరుజట్లలోని ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోని జమ్ముకశ్మీర్‎కు చెందిన ఓ క్రికెటర్‎కు కరోనా సోకింది.