తాంత్రిక్ మఠంలో కరోనా కలకలం

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‎లో ధర్మశాల సమీపంలోని సిద్భరి గైటో తాంత్రిక్ మఠంలో 154 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఫిబ్రవరి 23న జిల్లాలో పలు కేసులు వెలుగుచూడగా, తాజాగా సిద్భరి మఠానికి చెందిన సన్యాసుల్లో 154 కొవిడ్ -19 కేసులు బయటపడ్డాయని కాంగ్రా జిల్లా ముఖ్య వైద్యధికారి డాక్టర్ గుర్ దర్శన్ గుప్తా పేర్కొన్నారు. వీరిలో ఒక సన్యాసి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. కరోనా పాజిటివ్‎గా తేలిన మిగిలిన వారిని మఠంలోనే క్వారంటైన్‎లో ఉంచామని తెలిపారు.

ads

ఈ మఠం పరిధిలోని ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‎గా ప్రకటించామని, ఈ ప్రాంతంలోకి ఏ ఒక్కరినీ అనుమతించడం లేదని వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన సన్యాసుల్లో పలువురు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కర్ణాటక, ఢిల్లీలో ప్రయాణించారని డాక్టర్ గుప్తా తెలిపారు. కరోనా పాజిటివ్‎గా తేలిన సన్యాసుల్లో అత్యధికులకు ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని చెప్పారు.