రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,994 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 96 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 18,373 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఏపీలో 24 గంటల వ్యవధిలో 58,835 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో కరోనాతో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది చనిపోయారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 10మంది చొప్పున తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో 8 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

ads