కోచ్, బ్యాట్స్‎మన్‎కు కరోనా


కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్‎గా నిర్ధారణ అయ్యింది. లంక ప్రధాన కోచ్ మిక్కీ ఆర్థర్ , బ్యాట్స్‎మన్ లహిరు తిరుమానెకు కరోనా సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం వెల్లడించింది. ఈ నెల చివర్లో లంక టీం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ టూర్‎కు ముందు నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికి వైరస్ సోకడంతో పర్యటనను రీ షెడ్యూల్ చేసే అవకాశాన్ని బోర్డు పరిశీలిస్తోంది. విండీస్, లంక మధ్య సిరీస్ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభంకావాల్సి ఉంది. ఈ పర్యటనలో శ్రీలంక రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‎లు ఆడాల్సి ఉంది.