కరోనా అన్‌లాక్ కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కరోనా అన్​లాక్​ కొత్త నిబంధనలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది.

– స్విమ్మింగ్ పూల్స్‌కు పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేసింది.

– ఇప్పటివరకు క్రీడాకారులకు మాత్రమే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి ఉండగా 1వ తేదీ నుంచి ఈత కొలనులను అందరికీ అనుమతిస్తున్నట్లు పేర్కొంది.

– ఎగ్జిబిషన్ హాళ్లకు అనుమతి ఇస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో వెలువరించింది.

– అయితే కేవలం వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించింది.

– రవాణా సౌకర్యాలపై ఆంక్షలను పూర్తిగా తొలగించింది.

– రాష్ట్రాలు- రాష్ట్రాలు మధ్య, రాష్ట్రాల్లోని జిల్లాల మధ్య ప్రయాణాలకు
ఎలాంటి అనుమతులు అక్కర్లేదని స్పష్టం చేసింది.

– ఇ-పర్మిట్, స్పెషల్ పర్మిషన్ లాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదని తెలిపింది.

– సినిమా హాల్స్, థియేటర్లకు పూర్తి స్థాయి సామర్థ్యానికి అనుమతి ఇచ్చింది.

– 65 ఏళ్లకు పైబడిన వారు, ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

– కంటైన్మెంట్ జోన్లలో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం హోంశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.