మళ్లీ కోరలు చాస్తున్న కరోనా

మహారాష్ట్ర: దేశంలో అడుగిడిన తొలినాళ్లలో మహారాష్ట్రను వణికించిన కరోనా మహమ్మారి అక్కడ మరోమారు చెలరేగిపోతోంది. మూడున్నర నెలల తర్వాత నిన్న మళ్లీ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,112 కేసులు నమోదయ్యాయి. అక్టోబరు 30 తర్వాత 6 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇక్కడ ఇదే తొలిసారి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చిన కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. నిన్న నమోదైన కేసుల్లో అకోలా, పూణె, ముంబై డివిజన్‌లలోనే అత్యధికంగా వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,87,632కు చేరినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.