బ్రెజిల్​ రెండో స్థానం

న్యూఢిల్లీ : కరోనా ఇన్ఫెక్షన్ న‌మోదైన మొత్తం కేసులలో భారత్‌ను అధిగ‌మించి బ్రెజిల్ రెండో స్థానానికి చేరుకున్న‌ది. బ్రెజిల్​లో శుక్ర‌వారం నాటికి 84,047 మంది రోగులు ఉండ‌గా, మొత్తం సోకిన వారి సంఖ్య 1,13, 68, 316 కు చేరుకున్న‌ది. 1,13, 33, 491 సోకిన రోగుల‌తో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇదే సమయంలో అమెరికాలో 2,99, 90, 597 మంది రోగులు ఉన్నారు. గత 24 గంటల్లో, ప్రపంచంలో 4.85 లక్షల మంది కొత్తగా వైరస్​ సోకిన వ్యక్తులను గుర్తించారు. తొమ్మిది వేలకు పైగా రోగులు మృతిచెందారు. ఇప్పటివరకు 92.62 మిలియన్లకు పైగా ప్ర‌జ‌లకు కరోనా ఇన్ఫెక్షన్లు నయమయ్యాయి. 26.50 లక్ష‌ల‌ మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్న‌ట్లు డబ్ల్యూహెచ్​వో గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ads