హైదరాబాద్‎లో ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు పూర్తి

హైదరాబాద్ : మహబూబ్‎నగర్ -హైదరాబాద్ -రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తైంది. 7 రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో ఉన్నారు. సమీప రామచందర్‎రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 7 రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి రామచందర్‎రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 5,973 ఓట్లు పోలయ్యాయి. 7 రౌండ్లలో 21,309 ఓట్లు చెల్లలేదు. ప్రస్తుతం ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో సెకండ్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.

ads