ఆర్‌ఎస్‌ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

కరీంనగర్ జిల్లా : మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ మున్సిఫ్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ ఈ యేడాది మార్చి 16న న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి ప్రవీణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకపూర్ ( ధూళికట్ట) గ్రామంలో జరిగిన స్వేరోస్ భీమ్ దీక్ష సమయంలో కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కరీంనగర్ మూడో పట్టణ పోలీసులకు న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ads