కొవిడ్​ వారియర్స్​చే ‘ఎఫ్‌సీయూకే’ సాంగ్స్​

హైదరాబాద్​ : జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంట‌గా రూపొందుతున్న ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కేఎల్​ దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా ఈ సినిమా పాట‌ల‌ను విభిన్న త‌ర‌హాలో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. సాధార‌ణంగా సినిమా పాట‌ల‌ను సినిమా స్టార్ల‌తో రిలీజ్ చేస్తుంటారు. కానీ ‘ఎఫ్‌సీయూకే’ పాట‌ల‌ను కొవిడ్ హీరోలు రిలీజ్ చేయ‌నున్నారు. అవును. ఈ విష‌యాన్ని జ‌గ‌ప‌తిబాబు ఎనౌన్స్ చేశారు. అంద‌రినీ క్షేమంగా ఉంచ‌డానికి త‌మ జీవితాల్ని ప‌ణంగా పెట్టి, కొవిడ్‌పై అలుపెరుగ‌కుండా పోరాడుతూ వ‌స్తున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు సెల్యూట్ చేయాల‌నే స‌దుద్దేశంతో పాట‌ల విడుద‌ల‌కు వారిని ఆహ్వానించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఓ వీడియో సందేశంలో ఆయ‌న, దేశ‌మంతా లాక్‌డౌన్‌లో ఉన్న కాలంలో, అంద‌రూ ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌డానికి భయ‌ప‌డుతున్నారు. స‌మ‌యంలో ఒక్క‌రోజు కూడా వెనక‌డుగు వేయ‌కుండా నిరంత‌రాయంగా సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన మెడిక‌ల్‌, పోలీసు, మునిసిప‌ల్, మీడియా సిబ్బంది కృషిని కొనియాడారు. వారి అసామాన్య సేవ‌ల‌కు గుర్తింపుగా ఒక్కో విభాగానికి చెందిన రియ‌ల్ హీరో చేతుల మీదుగా ‘ఎఫ్‌సీయూకే’ చిత్రంలోని ఒక్కో పాట‌ను విడుద‌ల చేయిస్తున్న‌ట్లు జ‌గ‌ప‌తిబాబు చెప్పారు. ఇదివ‌ర‌కు ఈ వారం మొద‌ట్లో జ‌రిగిన ‘ఎఫ్‌సీయూకే’ టీజ‌ర్ రిలీజ్ చేశారు.

‘తాను ప‌నిచేసిన అత్యంత విల‌క్ష‌ణ చిత్రాల్లో ఈ సినిమా ఒక‌ట‌ని తెలిపారు. ఇది పూర్తి రొమాంటిక్ కామెడీ మూవీ అనీ, ఇందులో తాను చేసిన‌ ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ చాలా తృప్తినిచ్చింద‌నీ చెప్పారు. ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుంది’ అన్నారు హీరో జగపతిబాబు.

తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం:
మాటలు : ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం : శివ జీ
సంగీతం : భీమ్స్ సీసీరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : జీవన్
పాటలు : ఆదిత్య, కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్ : కిషోర్ మద్దాలి
ఆర్ట్: జేకే మూర్తి
పీఆర్వో : యల్ వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్ : వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత : య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం : విద్యాసాగర్ రాజు
నిర్మాత :కేఎల్​ దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌ : శ్రీ రంజిత్ మూవీస్