కొత్తగా 95 మందికి కరోనా

అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 95 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 129 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. విశాఖ జిల్లాలో ఒకరు ప్రాణాలు వదిలారు. ఏపీలో ఇప్పటివరకు 8,88,099 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,79,780 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 1162 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ ఇన్‎ఫెక్షన్ కారణంగా ఇవాళ్టివరకు 7157 మంది మృత్యువాతపడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 25,445 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1,32,14,548 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించారు.