ఎలక్ట్రిక్​ బైక్స్ ను ప్రారంభించిన సజ్జనార్​

హైదరాబాద్ : రాయదుర్గం పీఎస్​లో ఎలక్ట్రానిక్ బైక్ లను సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు. మహిళా పోలీసులు గేట్ టెడ్ కమ్యూనిటీ ప్రాంతాల్లో వెళ్లడానికి బైక్ లు ఉపయోగపడతాయని చెప్పారు. బైక్ పై ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు ఉంటారని, వీటితో పాటు
4 జీ తో బాడీ వీర్ కెమెరా లు అందిస్తున్నామని సీపీ తెలిపారు. బాడీ వీర్ కెమెరాలను కంట్రోల్ రూమ్ కనెక్ట్ చేసి లా అండ్ ఆర్డర్ సమస్యలలో, ర్యాలీ లు, పొలిటికల్ మీటింగ్ లకు, రాస్తారోకో కార్యక్రమాలకు ఉపయోగపడుతాయయని సీపీ తెలియజేశారు.

సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా నెంబర్ 9392947908 ఏర్పాటు చేశామని చెప్పారు. తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. సీసీటీవీ కెమెరా ల పై ఫిర్యాదులు చేయడానికి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక నెంబర్ ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్​ వివరించారు. బ్లూ కోట్ సిబ్బందికి ప్రత్యేక జాకెట్లు, హెల్మెట్లను అందించారు. థర్మల్ ప్రింటర్స్ అందుబాటులో ఉందని, థర్మల్ ప్రింటర్స్​తో ఈ పీటీ కేస్​ల వివరాలు తెలియడం సులభంగా ఉంటుందని సీపీ సజ్జనార్​ వెల్లడించారు.