10న క్రికెట్ టోర్నమెంట్స్


వరంగల్ అర్బన్ జిల్లా : టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉండే టీఆర్ఎస్వీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ప్రతీ యేడాది సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కేసీఆర్ ఛాంపియన్‌ షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో విలేకరుల సమావేశంలో తెలిపారు. అనేక సేవా కార్యక్రమాలతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్పించే దిశగా నిర్వహిస్తోన్న ఈ క్రికెట్ టోర్నమెంట్స్ లో ఆసక్తి గల క్రీడాకారులు పాల్గొని టోర్నమెంట్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.బన్నా అయిలయ్య, ప్రముఖ క్రీడాకారులు మతిన్, ఫారూక్, 50వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్, టీఆర్ఎస్వీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించగలరు 9701291053, 9652698690