ఇంగ్లండ్ టార్గెట్ 337

పుణె : కోహ్లీసేన ఇంగ్లండ్‎కు మరోసారి భారీ టార్గెట్‎ను విసిరింది. పుణెలో జరుగుతున్న రెండవ వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. మిడిల్ ఆర్డర్‎లో కేఎల్ రాహుల్ మరోసారి సత్తా చాటాడు. వన్డేల్లో 5వ సెంచరీ నమోదు చేశాడు. 7 ఫోర్లు, 2 సిక్సర్లతో రాహుల్ 108 రన్స్ చేసి ఔటయ్యాడు.

ads

శ్రేయర్ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ దూకుడు బ్యాటింగ్‎తో దుమ్మురేపాడు. కేవలం 40 బంతుల్లో 77 రన్స్ చేశాడు. పంత్ ఇన్నింగ్స్‎లో 7 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇక చివరిలో హార్దిక్ పాండ్యా కూడా రఫాడించాడు. 16 బంతుల్లో 35 రన్స్ చేసి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 66 రన్స్ చేశాడు. తొలి వన్డేలో భారత్ 66 రన్స్ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.