క్రిస్టియానో రొనాల్డో మరో వరల్డ్ రికార్డ్

బుడాపెస్ట్ : పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో యూరో 2020 ఫుట్ బాల్ టోర్నీలో మాంచి ఫాంలో ఉన్నాడు. ఇప్పటికే యూరోకప్ లో అత్యధిక గోల్స్ చేసిన ఈ స్టార్ ప్లేయర్.. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ లో అత్యధిక గోల్స్ వరల్డ్ రికార్డును సమం చేశాడు. బుధవారం ఫ్రాన్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు గోల్స్ చేసిన అతను, ఇన్నాళ్లూ ఇరాన్ కు చెందిన అలీ డేయీ పేరిట ఉన్న రికార్డును సమం చేయగల్గాడు. ప్రస్తుతం రొనాల్డో 109 గోల్స్ తో అలీతో కలిసి టాప్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ డ్రా కావడంతో పోర్చుగల్ నాకౌట్ లోకి ప్రవేశించింది.

ads

ఇదే టోర్నీలో పోర్చుగల్ కనీసం మరో మ్యాచ్ ఆడుతుండటంతో రొనాల్డో కొత్త వరల్డ్ రికార్డు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే యూరో 2020లో అతడు టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మూడు మ్యాచ్ లలో 5 గోల్స్ చేశాడు. అంతేకాడు ఓవరాల్ గా యూరోలో అత్యధిక గోల్స్ రికార్డు కూడా అతని పేరిటే ఉంది. మొత్తం 14 గోల్స్ తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.