కంట్రోల్​ చేసినా విమర్శలు వస్తున్నాయి

హైదరాబాద్ : భైంసా అల్లర్లను తాము ఎంతో కష్టపడి కంట్రోల్ చేసినా తమపై విమర్శలు వస్తున్నాయని ఐజీ నాగిరెడ్డి అన్నారు. మంగళవారం ఐజీ విలేకరుల సమావేశం నిర్వహించారు. తోట మహేష్, దత్తు పటేల్ బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్నా రిజ్వాన్, ఆయన స్నేహితులను నెత్తి పై కొట్టారు దీంతో భైంసా గొడవ స్టార్ట్ అయిందని ఐజీ తెలిపారు. గొడవలో రమణా యాదవ్ అనే కానిస్టేబుల్ కు దెబ్బలు తగిలాయి. గొడవ స్టార్ట్ అయిన గంటన్నరలోపే ఆపేశామని ఐజీ నాగిరెడ్డి వివరించారు. అబ్దుల్ కబీబ్ అండ్ తోటా విజయ్ గ్రూప్ ల మధ్య గొడవల్లో కలగజేసుకున్నారన్నారు. సంతోష్- బాలాజీ- క్రాంతి- ఇండోజి పలు ఘర్షణలకు పాల్పడ్డారు. సంతోష్ అండ్ టీమ్ ను అరెస్ట్ చేసిన తరువాత గొడవలు పూర్తిగా సర్దుమనిగాయని ఐజీ పేర్కొన్నారు.

ads

ఈ ఘర్షణలో అన్ని రకాల టెక్నికల్ ఆధారాలు సేకరించి 42 మందిని అరెస్ట్ చూపించామన్నారు. మరో 70 మంది ఇన్వాల్వ్ అయినట్లు విచారణలో తేలిందని చెప్పారు. భైంసా లో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని ఐజీ సూచించారు. . నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నామన్నారు. ఎవరు తప్పు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. పోలీసులు ఎవరికీ సపోర్ట్​ చేయలేదని ఐజీ వెల్లడించారు. మైనర్​ పిల్లల విషయంలో పక్కా ఆధారాలతో విచారణ చేపడుతున్నామన్నారు. ఆధారాలు లేకుండా ఎవరిపై పోలీస్​శాఖ చర్యలు తీసుకోదని ఐజీ నాగి రెడ్డి స్పష్టం చేశారు.