సీఎం దృష్టికి తీసుకెళ్తాం

హైదరాబాద్​ : సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు సీఎస్​ సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ మూడు ఉద్యోగుల సంఘాల ఆఫీసు బేరర్లతో సమావేశమైంది. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ లతో బుధవారం బీఆర్కే భవన్​లో సమావేశం జరిపింది.

పీఆర్సీ సిఫార్సులు మరియు ఇతర సమస్యలకు సంబంధించి మూడు ఉద్యోగుల సంఘాలు మరియు వారి అభిప్రాయాలను మరియు ప్రతిపాదనలు త్రిసభ్య కమిటీ అసోసియేషన్ వారీగా విన్నది. పీఆర్సీ సిఫార్సులు మరియు ఇతర సంబంధిత విషయాలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, వివిధ ఉద్యోగుల సంఘాల ఆఫీస్ బేరర్లు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీ మమత, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, యం.బీ క్రిష్ణ యాదవ్, టీఎన్జీవోఎస్​ ప్రెసిడెంట్ యం రాజేందర్ , వైస్ ప్రెసిడెంట్ రేచల్ , సిటీ ప్రెసిడెంట్ ముజిబ్ , జనరల్ సెక్రెటరీ యం ప్రతాప్ , సెక్రటేరియట్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రావు, జనరల్ సెక్రెటరీ లింగ మూర్తి తదితరులు పాల్గొన్నారు.