31 వరకు లా సర్టిఫికెట్ల అప్‎లోడ్

హైదరాబాద్: లా కోర్సులకు ఒరిజినల్ సర్టిఫికెట్ల అప్ లోడ్ గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్ సెట్ రెండవ,చివరి దశ కౌన్సిలింగ్ ద్వారా లా కోర్సుల్లో ప్రవేశం  పొందినవారు ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కాన్ కాపీలను అప్ లోడ్ చేసేందుకు చివరితేదీని జనవరి 31 వరకు పొడిగించారు.

రిజిస్టర్డ్ అభ్యర్థుల జాబితాను ఫిబ్రవరి 1న https://lawcetadm.tsche.ac.in వెబ్ సైట్ లో ప్రదర్శించనున్నట్లు టీఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొ.పి.రమేష్ తెలిపారు. ఫిబ్రవరి 2,3వ తేదీల్లో వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ఫిబ్రవరి 6న వెబ్ సైట్ లో ప్రదర్శించనున్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి 12వ తేదీ లోపు ట్యూషన్ ఫీజు చెల్లింపు చలాన్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ కోసం కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని టీఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొ.పి.రమేష్ తెలిపారు.