ఎస్​హెచ్​జీ రుణాలు ఇవ్వడానికి సిద్ధం

వరంగల్​ అర్బన్​ జిల్లా : ఎస్​హెచ్​జీ రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని డీసీసీబీ చైర్మన్​ మార్నేని రవీందర్​ తెలిపారు. వీటి రేట్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​ 10.05 ఉందన్నారు. మంగళవారం నందనం మేనేజింగ్ కమిటీ పాలక వర్గం సమావేశంలో మార్నేని పాల్గొన్నారు. రైతులకు బ్యాంకు ఖాతా లను తెరిపించాల్సిన బాధ్యత సొసైటీల పై ఉందని సూచించారు. గతంలో ఇచ్చిన రుణాలను రికవరీ చేస్తామన్నారు. నందనం సహకార సంఘం బిల్డింగ్​ను త్వరలో ప్రారంభోత్సవం చేసుకుంటామన్నారు. అక్కడే క్రాఫ్ రుణాలు మరియు గోల్డ్ లోన్ల సదుపాయం కలుగజేస్తామని డీసీసీబీ చైర్మన్​ మార్నేని రవీందర్​ వివరించారు.

ads

ఇప్పుడు ఉన్న రుణాలతో నందనం రెండు, ఐనవోలులో ఒకటి గోదాముల ఏర్పాటు చేస్తామని చెప్పారు. విత్తనాలు, ఎరువుల కోసం కౌంటర్ ఏర్పాటు చేయబోతున్నామని తీర్మానించామన్నారు. తీసుకున్న రుణాలను రికవరీ చేయాల్సిన బాధ్యత సొసైటీ లకు ఉంటుందని డీసీసీబీ చైర్మన్​ మార్నేని రవీందర్​ వెల్లడించారు.

ఈ సమావేశం లో సొసైటీ ఉపాధ్యక్షులు తక్కళ్లపల్లి చందర్ రావు, డైరెక్టర్లు వడిచర్ల శ్రీనివాస్, బొమ్మినేని బుచ్చిరెడ్డి, రాజారపు కుమార్, మేటి చిరంజీవి, సొసైటీ నోడల్ ఆఫీసర్ దేవేందర్ రెడ్డి, సొసైటీ సీఈవో సంపత్ తదితరులు పాల్గొన్నారు.