ఐపీఎల్ 2021 : మెరిసిన డివిలియర్స్

అహ్మదాబాద్ : ఐపీఎల్ 14వ సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఏబీ డివిలియర్స్ ( 75 నాటౌట్ : 42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ) మెరుపు అర్ధశతకంతో రాణించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (12), దేవదత్ పడిక్కల్ (17) క్లీన్ బౌల్డ్ అయ్యారు. మాక్స్ వెల్ (25 : 20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు ), రజత్ పటిదార్ (31 : 22 బంతుల్లో 2 సిక్సర్లు ) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, రబాడ, ఆవేష్ ఖాన్, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ ఒక్కొక్క వికెట్ తీశారు.

ads

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరును ఆరంభం నుంచి ఢిల్లీ బౌలర్లు కట్టడి చేశారు. ఆవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ నాల్గో ఓవర్ ఆఖరి బంతికి విరాట్ కోహ్లీ (12) బౌల్ట్ కాగా, ఇషాంత్ శర్మ వేసిన తర్వాతి ఓవర్ మొదటి బంతికే దేవదత్ పడిక్కల్ (17) కూడా బౌల్డ్ అయ్యాడు. సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాంత్ బుల్లెట్ లాంటి బంతులతో బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టాడు. దీంతో పవర్ ప్లే ఆఖరికి 36 /2 తో కష్టాల్లో పడింది.

ఈ దశలో మ్యాక్స్ వెల్ , పటిదార్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా. అయినప్పటికీ ఎక్కువసేపు నిలువలేదు. వీరిద్దరూ ఔటైన డివిలియర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలోనే 35 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. స్టాయినీస్ వేసిన 20 ఓవర్లో 3 సిక్సర్లు బాదినే ఏబీడీ 23 రన్స్ రాబట్టడంతో జట్టు స్కోరు 170 దాటింది.