ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు

హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఉమ్మడి నల్గొండ- ఖమ్మం- వరంగల్, మహబూబ్‎నగర్ – హైదరాబాద్ – రంగారెడ్డి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లను అధికారులు రేపు పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు గడువు ఉంది. మార్చి 14న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహన జరుగనుంది. మార్చి 17న రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.