భారత మహిళల ఫుట్ బాల్ టీం ఓటమి

తాష్కెంట్ : 87వ నిమిషంలో ఫ్రీకిక్ సాయంతో ఉజ్భెకిస్థాన్ ఏకైక గోల్ చేయడంతో భారత మహిళల ఫుట్ బాల్ జట్టు ఓటమి పాలైంది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి ఫ్రెండ్లీ మ్యాచ్ లో టీం ఇండియా 0 -1తో ఉజ్భెక్ చేతిలో ఓడింది. మొదటి అర్ధభాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినా గోలు నమోదు కాలేదు. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుండగా వచ్చిన ఫ్రీకిక్ ను ఉజ్బెక్ ప్లేయర్ మఫ్తునా షొయిమోవా వినియోగించుకొని గోల్ చేసింది.

ads