ఏప్రిల్ 15 నుంచి ‘అంబేద్కర్ ‘ డిగ్రీ పరీక్షలు

హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ వార్షిక పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 20 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి 27 వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 1 వరకు జరుగనున్నాయి. అభ్యర్థులు ఈ నెల 25లోగా ఫీజు చెల్లించాలని, పరీక్షకు రెండురోజుల ముందు హాల్ టికెట్లు డౌన్‎లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

ads