పంజాబ్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

అహ్మదాబాద్ : ఐపీఎల్ 14వ సీజన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శిఖర్ ధావన్ (69 నాటౌట్ : 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ) రాణించడంతో ఢిల్లీ సులువుగా గెలుపొందింది. పృథ్వీషా (39), స్టీవ్ స్మిత్ (24 ) రాణించారు. అంతకుముందు మయాంక్ అగర్వాల్ ( 99 నాటౌట్ : 58 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ) మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగడంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది.

ads

ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ మలన్ ( 26 : 26 బంతుల్లో ఫోర్, సిక్స్ ) ఫర్వాలేదనిపించాడు. ఆవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో అగర్వాల్ 3 ఫోర్లు, సిక్స్ బాది 23 రన్స్ రాబట్టడంతో జట్టు స్కోరు 160 దాటింది.