ఐపీఎల్ 2021 : ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ

అహ్మదాబాద్ : ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో అద్భుత విజయాన్ని అందుకున్నది. గురువారం జరిగిన మ్యాచ్ లో 7 వికెట్లతో కోల్ కతా నైట్ రైడర్స్ ను చిత్తుగా ఓడించింది. కోల్ కతా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పృథ్వీ షా (82 : 41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకానికి తోడు శిఖర్ ధావన్ ( 46 : 47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ ) విజృంభించడంతో ఢిల్లీ అలవోకగా గెలిచింది. కోల్ కతా బౌలర్లలో పాట్ కమిన్స్ ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టాడు.

ads

అంతకుముందు కోల్ కతా ఇన్నింగ్స్ లో శుభ్ మన్ గిల్ ( 43 : 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ ), ఆఖరిలో ఆండ్రూ రస్సెల్ ( 45 నాటౌట్ : 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. నితీష్ రాణా ( 15), రాహుల్ త్రిపాఠి ( 19), మోర్గాన్ (0). సునీల్ నరైన్ (0), దినేష్ కార్తీక్ (14) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ , లలిత్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.