కొత్తగా 2058 సీసీ కెమెరాలు

సైబరాబాద్​ : సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా 2058 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని రేపు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం గచ్చిబౌలి ఠాణా ఆవరణలో నిర్వహించనున్నారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ గచ్చిబౌలి ఠాణాలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.‘మాదాపూర్‌ జోన్‌లో 1145, శంషాబాద్‌-508, బాలానగర్‌ -405 కెమెరాల చొప్పున ఏర్పాటు చేసినట్లు’సీపీ సజ్జనార్​ తెలిపారు.