డయాగ్నోస్టిక్ హబ్ సెంటర్ ప్రారంభం

సిద్ధిపేట జిల్లా : సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో సకల సదుపాయాలతో ఉచిత డయాగ్నోస్టిక్ హబ్ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్ రావుతో పాటువైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ కలిసి ప్రారంభించారు. అంతకు ముందు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఆ తర్వాత డయాగ్నోస్టిక్ ద్వారా అందే సేవల తీరుతెన్నుల గురించి మంత్రి హరీశ్ రావు తెలుసుకున్నారు. రాష్ట్రంలో తొలి డయాగ్నోస్టిక్ హబ్ సిద్దిపేటలో ప్రారంభంకావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. డయాగ్నోస్టిక్ డెలివరీ వర్క్ ఫ్లో గురించి వైద్య ఆరోగ్య కమిషనర్ వాకాటి కరుణ మంత్రి హరీశ్ రావుకు సవివరంగా వివరించారు.

డయాగ్నోస్టిక్ హబ్ లోని వైద్య పరికరాలు,57 రకాల వైద్య పరీక్షల గురించి వైద్యాధికారులు మంత్రికి  వివరించారు.ల్యాబ్ పరీక్షల నిమిత్తం వచ్చిన రోగులకు వచ్చిన ల్యాబ్ రిపోర్టులను మంత్రి చేతుల రోగులకు అందించారు. రోగుల సహాయకుల విశ్రాంతి గదిని మంత్రి హరీశ్‎రావు ప్రారంభించారు.పేషేంట్స్ సహాయకుల, పేషేంట్స్ వేచి ఉండేందుకు షెడ్డును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.షెడ్ ఏర్పాటుతో రోగులకు , వచ్చే పేషేంట్స్ సహాయకులకు ఇబ్బందులు తీరాయని మంత్రి పేర్కొన్నారు. ఏ వ్యాధి నిర్దారణ పరీక్షలైన ఇక్కడే చేపడుతున్నట్లు, అన్ని పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేపడుతున్నట్లు పేర్కొన్నారు.