ఎర్రోళ్లకు డిక్కీ బృందం కృతజ్ఞతలు

హైదరాబాద్​ : ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు పబ్లిక్ వర్క్ లలో 21% శాతం రిజర్వేషన్ లు కల్పించినందుకు గాను ఎస్సీ ఎస్టీ కమిషన్​ చైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​కు డిక్కీ ప్రతినిధుల బృందం కృతజ్ఞతలు తెలిపింది. గురువారం కమిషన్​ కార్యాలయంలో చైర్మన్​ ఎర్రోళ్లను డిక్కీ ప్రతినిధుల బృందం కలిసింది. తెలంగాణ ప్రభుత్వం జీవో 59 ఇచ్చి ఎస్సీ ఎస్టీ వర్గాలకు అండగా నిలవడం దేశంలోనే మొదటిసారి అని తెలిపింది. సీఎం కేసీఆర్​ సారథ్యంలోని ప్రభుత్వం ఈ విషయంలో చరిత్ర సృష్టించిందని డిక్కీ ప్రతినిధుల బృందం పేర్కొంది. ఈ జీవో అమలుకోసం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్​ ఎర్రోళ్ల శ్రీనివాస్ చొరవ తీసుకున్నారని బృందం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ads

ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం తో నిర్వహించిన సమీక్షలో ఎస్సీ ఎస్టీ కాంట్రాక్టర్లకు 21%రిజర్వేషన్ కేటాయించాలని కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు. రిజర్వేషన్ల అమలుకు జీవోను సింగరేణి యాజమాన్యం ఆమోదించింది. ఇక నుంచి సింగరేణి కాంట్రాక్టు పనులలో ఎస్సీ ఎస్టీ వర్గాల యువ కాంట్రాక్టర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా డిక్కీ ప్రతినిధులకు ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు.