ధైర్యంగా వ్యాక్సిన్​ తీసుకోవాలి

హైదరాబాద్​ : కరోనా రక్కసి నుంచి కాపాడుకోవడం కోసం ఇటీవలే వ్యాక్సిన్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు ముందుకొచ్చి ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే మరికొందరు ఈ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాను వ్యాక్సిన్ వేయించు కోవడమే కాకుండా తన హాస్పిటల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ను కూడా వ్యాక్సిన్​ తీసుకోవాలని కోరారు. ఈ వ్యాక్సినేషన్​ విషయంలో ఎలాంటి అపోహలు వద్దని ఉపాసన తెలిపారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. అప్పుడే కరోనా మహమ్మరినుంచి బయట పడుతామని ఉపాపన చెప్పారు.