రాష్ట్రంలో లాక్ డౌన్…ఎక్కడో తెలుసా..?

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో లాక్ డౌన్ ప్రకటించారు. నేటి నుంచి వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. కొవిడ్ కేసులు అధికంగా రావడంతో లాక్ డౌన్ ప్రకటించినట్లు ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో ఉదయం 7గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. వారం రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో బుధవారం 1184 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్ సోకిన వారిలో ఇటీవల నలుగురు మృతి చెందారు.

ads