ముంబై : ఇండియా, న్యూజీలాండ్ మధ్య జరుగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వడం లేదు. ఈ మ్యాచ్ సౌథాంప్టన్ లో జరుగనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. నిజానికి దీనిపై ఐసీసీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా గంగూలీ మాత్రం సౌథాంప్టనే అని తేల్చేశారు. లండన్‌లో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగానే వేదికను లార్డ్స్ నుంచి సౌథాంప్టన్‌కు తరలించారు. ఇండియా, న్యూజీలాండ్ మధ్య సౌథాంప్టన్‌లో జరుగబోయే ఫైనల్ మ్యాచ్‌కు వెళ్లాలని అనుకుంటున్నా అని ఇండయా టుడేతో గంగూలీ చెప్పాడు.

ఈ ఫైనల్ వన్డే వరల్డ్‌కప్‌కు ఉన్నంత విలువ ఉంటుందా అని ప్రశ్నించగా, ప్రతీ ట్రోఫీకి దానికి ఉండాల్సిన విలువ ఉంటుంది. వన్డే వరల్డ్ కప్ అద్భుతమైనది. కరోనా మహమ్మారి కారణంగా ఈ సారి డబ్ల్యీసీ క్లిష్టంగా మారింది. ప్రతీ టీం సమానమైన మ్యాచ్‌లు ఆడినప్పుడు చూడండి అని గంగూలీ అన్నారు. ఐపీఎల్ నుంచి 6 నెలల పాటు బయో బబుల్‌లో ఉన్నా ప్లేయర్స్ సాధించిన ఘనత అద్భుతమని గంగూలీ కొనియాడారు. ఫైనల్లో న్యూజీలాండ్పైనా గెలుస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.