ఘనంగా జాగిలాల పాసింగ్​ అవుట్​

హైదరాబాద్​: మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం ఘనంగా జరిగింది. ఈ పాసింగ్​ అవుట్​ పరేడ్​లో 50 జాగిలాలు పాల్గొన్నాయి. వీటిలో ముఖ్యంగా లెబ్రెడాల్​, కోకోర్​ స్పైనల్​, గోల్డెన్ రీట్రీవర్​ జాతులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీ జితేందర్, సైబరాబాద్​ సీపీ సజ్జనార్, ఇంటిలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు హాజరయ్యారు.