హైదరాబాద్: కొవిడ్ టీకాపై ఎటువంటి అపోహాలకు గురికావొద్దని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. శనివారం మల్కాజిగిరి పీహెచ్సీలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కొవిడ్ టీకా కార్యక్రమాన్నిసీపీ ప్రారంభించారు. మొదటగా సీపీ టీకా తీసుకున్నారు. 30 నిమిషాలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సీపీ సూచించారు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తితే వెంటనే దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్ ని సంప్రదించాలని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. ఈ టీకా పంపిణీకి మొత్తం రాచకొండ పరిధిలో 41సెంటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు 100 మంది సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు.
Home News