వాటిని గూగుల్‌లో వెతకొద్దు..!!

హైదరాబాద్ : గూగుల్ వేదికగా భారీ మోసాలు వెలుగుచూస్తున్నాయి. అందుకే గూగుల్‌ సెర్చ్‌లో కస్టమర్ కేర్ నంబర్ల కోసం వెతకొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వారికి ఓటీపీలు చెప్పొద్దని సూచిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ అరచేతిలో ఒదిగిపోయిన తర్వాత ఏం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్ చేయడం అలవాటుగా మారిపోయింది. విజ్ఞానం, వినోదం, టెక్నాలజీ.. ఇలా ఏదైనా గూగుల్‌లో సెర్చ్ చేసేస్తుంటాం. అందులో బ్యాంకులు, ఫోన్లు, మొబైల్ కనెక్షన్లకు సంబంధించిన కస్టమర్ కేర్‌ నంబర్లను కూడా వెతుకుతుంటాం. అయితే అదే పెద్ద పొరపాటుకు దారి తీయొచ్చంటున్నారు సైబర్ క్రైం పోలీసులు. గూగుల్ గూటిలో సైబర్ నేరగాళ్లు దాక్కుని ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.

ads