గ్రామీణ అందాలకు ముగ్ధుడైన ఆండ్రూ

సిద్దిపేట జిల్లా: గ్రామీణ ప్రాంత హరిత అందాల పట్ల డాక్టర్​ ఆండ్రూ ముగ్ధుడయ్యారు. తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్​ ఆండ్రూ ఫ్లెమింగ్ సిద్దిపేట జిల్లాలో ఆదివారం పర్యటించారు. తెలంగాణ కు హరిత హారంలో భాగంగా పల్లెల్లో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల చిత్రాలను తన మొబైల్ లో బంధించారు ఆండ్రూ ఫ్లెమింగ్. ట్రీ టన్నెల్ క్యాప్షన్ తో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.