‘స‌న్నాఫ్ ఇండియా ’ ఫస్ట్​ లుక్​

డాక్టర్ మోహ‌న్‌బాబు `స‌న్నాఫ్ ఇండియా` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌హైదరాబాద్​ : భారతీయ సినిమా యొక్క అత్యంత బహుముఖ నటులలో ఒకరైన డాక్టర్ మోహన్ బాబు చిత్రనిర్మాణంలో ప్రతి విభాగం గురించి లోతైన జ్ఞానం కలిగి ఉన్నారు. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `సన్నాఫ్ఇండియా`కు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం యొక్క శనివారం విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్లో డాక్టర్ మోహన్ బాబు మెడ‌లో రుద్రాక్ష మాల ధరించి ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

మోహన్ బాబు కొత్త హెయిర్‌డోతో పూర్తిగా భిన్నమైన గెటప్‌లో క‌నిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం గడ్డం కూడా పెంచుకున్నారు ఇన్ని దశాబ్దాల సినీ కెరీర్‌లో మోహన్ బాబుకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై అంచ‌నాలను మరో లెవ‌ల్‌కి పెంచింది.

టాలీవుడ్‌లో ఇంత‌వ‌ర‌కూ రాని ఒక విభిన్న క‌థా క‌థ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విష్ణు మంచు భార్య, మోహన్ బాబు కోడ‌లు వెరానికా మంచు ఈ చిత్రంతో స్టైలిస్ట్‌గా మారారు. ఆమె మోహన్ బాబును పూర్తిగా కొత్త అవతారంలో చూపించారు.

ఈ చిత్రానికి మాస్ట్రో ఇళ‌యరాజా సంగీతం అందింస్తుండ‌గా సర్వేష్ మురారి ఛాయాగ్రాహకుడు.

ఈ చిత్రానికి మాట‌లు డైమండ్ ర‌త్న‌బాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్‌. సుద్దాల అశోక్‌తేజ లిరిక్స్ అందిస్తున్నారు. గౌతంరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా చిన్నా ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

డాక్టర్​ మోహ‌న్‌బాబు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం : డైమండ్ ర‌త్న‌బాబు
స్క్రీన్ ప్లే : డా.మోహ‌న్‌బాబు
నిర్మాత‌: విష్ణుమంచు
బ్యాన‌ర్స్‌ : శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
సంగీతం : మాస్ట్రో ఇళ‌యరాజా
సినిమాటోగ్ర‌ఫీ : సర్వేష్ మురారి
మాట‌లు: డైమండ్ ర‌త్న‌బాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్‌
స్టైలిస్ట్‌(మోహ‌న్‌బాబు) : వెరానిక మంచు
లిరిక్స్‌: సుద్దాల అశోక్ తేజ‌
ఆర్ట్‌: చిన్నా
ఎడిట‌ర్‌: గౌతంరాజు