డీఆర్‎డీవోలో అప్రెంటిస్ పోస్టులు

న్యూఢిల్లీ : కేంద్ర రక్షణశాఖ పరిధిలో పనిచేసే డీఆర్ డీవోలో వివిధ విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కల్గిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. డైనమిక్ టెస్ట్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ ఆర్మమెంట్ సిస్టమ్స్ లో ప్రూఫ్ అండ్ ఎక్స్ పరిమెంటల్ ఎస్టాబ్లిష్ మెంట్ (పీఎక్స్ ఈ ) లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలో బాలాసోర్, చాందీపూర్ లో పనిచేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు : 62

ఇందులో డిప్లొమా టెక్నీషియన్ -39 ( సినిమాటోగ్రఫీ 2, సివిల్ ఇంజినీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 14, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4, ఎలక్ట్రానిక్స్ 1, ఈసీఈ 7, ఈఐఈ1 , మెకానికల్ 7, సర్వే ఇంజనీరింగ్ 1 ), ఐటీఐ టెక్నీషియన్ – 23 పోస్టులు ( ఫిట్టర్ 7, డీజిల్ మెకానిక్ 1, ఎలక్ట్రిషన్ 3, కోపా 4, ఎలక్ట్రానిక్స్ 2, వెల్డర్ 2, టర్నర్ 2, మెషినిస్ట్ 2 )

అర్హతలు : సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.

ఎంపిక విధానం : దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.

స్టయిఫండ్ : డిప్లొమా అప్రెంటిస్ కు నెలకు రూ.8000, ఐటీఐ అప్రెంటిస్ కు రూ.7000 ఇస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 27

వెబ్ సైట్ : www.drdo.gov.in