తిరుపతిలో డ్రైవర్ యాప్ కలకలం

తిరుమల : అలిపిరి నుంచి తిరుమలకు బస్‌ డ్రైవింగ్‌ గేమ్‌ పేరిట విడుదలైన ఓ యాప్‌ తిరుపతిలో కలకలం రేపింది. ప్లే స్టోర్‌లో రూ.179 చెల్లించి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, గేమ్‌ గెలిస్తే 20 శ్రీవారి లడ్డూలు గెలిచినట్లని నిర్వహకులు ప్రచారం చేశారు. అయితే ఈ డ్రైవర్‌ యాప్‌పై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. డ్రైవింగ్‌ యాప్‌పై టీటీడీ విజిలెన్స్‌ విచారణ చేపట్టింది. ప్లే స్టోర్‌ నుంచి అధికారులు యాప్‌ను డిలీట్‌ చేయించారు. మరోవైపు డ్రైవర్ యాప్ నిర్వహకుడు సురేష్‌ పరారీలో ఉన్నాడు.

ads