టీఎస్‎పీఎస్‎సీ పేరిట నకిలీ మెయిల్

హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( టీఎస్‎పీఎస్‎సీ ) పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ మెయిల్ ను సృష్టించారు. మెయిల్ ఆధారంగా పౌర సరఫరాలు, తెలంగాణ ప్రత్యేక పోలీసు విభాగం, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయని ప్రకటనలు జారీ చేశారు. ఈ నకిలీ మెయిల్ తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ విభాగానికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. టీఎస్‎పీఎస్‎సీ అధికార వెబ్ సైట్ నుంచి కాకుండా నకిలీ ఈమెయిల్ ద్వారా ప్రకటన వచ్చినట్లు గుర్తించారు.

ads

దీనిపై టీఎస్‎పీఎస్‎సీ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ మెయిల్స్ పట్ల ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని టీఎస్‎పీఎస్‎సీ అధికారులు సూచించారు. ఎలాంటి ప్రకటనైనా అధికార వెబ్‎సైట్ నుంచే విడుదల అవుతుందని తెలిపారు.