సరస్వతిదేవి అలంకారంలో దుర్గమ్మ

విజయవాడ: కనకదుర్గ అమ్మవారి జన్మదినం సందర్భంగా మంగళవారం అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను విద్యార్థులు
దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన విద్యార్థులకు అధికారులు ఉచిత దర్శన భాగ్యం కల్పించారు. దర్శన అనంతరం విద్యార్థులకు పెన్ను, అమ్మవారి ఫోటో రక్షాకంకణం , కుంకుమ ప్రసాదాన్ని దేవస్థానం అధికారులు అందజేశారు.